

‘నేను పెద్ద సినిమాలకు భయపడను’ అంటూ నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు. శ్యామ్ సింగరాయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నాని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈవెంట్‌లో తన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.
‘ఈ సినిమా చాలా బాగా వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోబోతున్నాను. చాలా ఎక్జైటింగ్‌గా ఉంది. ఈ సినిమాలో చేయడం నాకు చాలా గర్వంగా ఉంద’ని నాని అన్నాడు. అంతేకాకుండా తన కజిన్ పంపిన ఓ మీమ్‌ను గుర్తుచేసుకున్నాడు.
పుష్ప, ఆర్ఆర్ఆర్ వరుసగా ఉన్నాయి. వీటి మధ్యలో ‘శ్యామ్ సింగరాయ్’ శాండ్విజ్ అవుతుందేమో అని ఆ మీమ్‌లో ఉందని చెప్పిన నాని.. ‘బ్రెడ్ ఎప్పుడూ బాగుంటుంది. కానీ అసలు రుచి మధ్యలో ఉంటుంద’ని అన్నాడు. దీంతో తన సినిమాపై ఉన్న కాన్ఫిడెంట్‌ను చూపించాడు.
‘వరుసగా పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ ‘శ్యామ్ సింగరాయ్’ ఏ సినిమాకి భయపడడు’ అని నాని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మరి నాని ఆశించిన స్థాయిలో ‘శ్యామ్ సింగరాయ్’ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
#Nani #ShyamSinghaRoy #Pushpa #RRR #ShyamSinghaRoyPreReleaseEvent