

Samantha | టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పిలిపించుకున్న సమంత, నాగచైతన్య ఒక్కసారిగా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. వీరి విడాకులకు అసలు కారణం ఏంటనేది ఇప్పటికీ తెలియదు. దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నా సమంత, చైతన్య ఎవరూ స్పందించడం లేదు.
అయితే వీరి విడాకులు ఓ డైరెక్టర్‌ను డైలామాలో పడేసిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి. సమంత, చైతన్య విడిపోవడంతో ఆ డైరెక్టర్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారని టాక్ నడుస్తోంది.
అది ఎవరో కాదు. సమంత, చైతన్యల బెస్ట్‌ఫ్రెండ్, సక్సెఫుల్ డైరెక్టర్ నందిని రెడ్డి. ప్రస్తుతం సంతోష్ శోభన్‌తో సినిమా చేస్తున్నారు. కానీ నందిని తన తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిందని అంటున్నారు.

నందిని రెడ్డి సమంత, చైతన్యతో విడివిడిగా రెండు సినిమాలు చేయాలని అనుకున్నారట. కథలు చెప్తే ఇద్దరూ ఒకే అన్నారట. దీంతో చైతన్య సినిమాను వైజయంతి పతాకంపై తెరకెక్కించేందుకు సిద్ధం చేశారు. అదేవిధంగా సమంత సినిమాను ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై చేయనున్నారు.
అయితే ఇప్పుడు వారిద్దరు రెండుమూడు నెలల్లో ఫ్రీ కానున్నారు. వీరిలో ఎవరి సినిమా ముందు చేయాలనేది అర్థం కాక నందిని రెడ్డి డైలామాలో పడ్డారని సినీ వర్గాలు అంటున్నాయి.
వీరి ఒకరి సినిమా ఓకే చేస్తే మరొకరు అప్‌సెట్ అవుతారని నందిని ఆలోచిస్తుందట. మరి ఈ సమస్యకి నందిని ఎలాంటి సమాధానం వెతుకుందో చూడాలి.
#Samantha #Chaitanya #Nandini reddy