

Bangarraju | కింగ్ నాగార్జున తన సినిమాల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు. వరుసగా రెండు సినిమాలు ప్లాప్ కావడంతో నాగ్ తన తాజా సినిమా ‘బంగార్రాజు’ విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.
ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అయితే ‘బంగార్రాజు’ విడుదల విషయంలో నాగ్ కొత్త రూల్స్ పెట్టాడట. ఈ సినిమా ఫైనల్ కాపీని తాను చూసి ఓకే చెప్తేనే సినిమా విడుదల కావాలని ఆంక్షలు విధించాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
సినీ సర్కిల్స్‌లోనూ ఇదే హాట్ టాపిక్. మన్మధుడు2, వైల్డ్ డాగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా విఫలం కావడంతోనే నాగ్ ఈ నిర్ణయానికి వచ్చాడని, బంగార్రాజు సినిమా ఎట్టి పరిస్థితుల్లో హిట్ కావాలని నాగ్ భావిస్తున్నాడని సినీ సర్కిల్స్‌లో పుకార్లు చేస్తున్నాయి. మరి ఇందులోని నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
#Nagarjuna #Bangarraju #NagaChaitanya,