

Bangarraju | 2022 సంక్రాంతి పోరు నుంచి పెద్దహీరోలందరూ తప్పుకున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు సైతం వెనకడుగు వేశాయి. కానీ కింగ్ నాగార్జున మాత్రం తన లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’తో సంక్రాంతి పోరులో దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నాడు.
దీంతో ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్న స్టార్ హీరోల సినిమా ‘బంగార్రాజు’ ఒక్కటే కావడం విశేషం. దీంతో ‘బంగార్రాజు’పై నాగ్‌కు ఏంటి ధైర్యం, బడా సినిమాలే వెనక్కి తగ్గుతుంటే నాగ్ మాత్రం దూసుకొస్తున్నాడని సందేహాలు వ్యక్తం చేశారు.
తాజా ఓ ఇంటర్వ్యూలో నాగ్ వీటికి సమాధానం ఇచ్చాడు. ‘బంగార్రాజు’పై తనకున్న ధైర్యాన్ని చెప్పేశాడు. ‘బంగార్రాజు’ను నేను పండుగ సినిమాగానే చూశాను. ముఖ్యంగా సంక్రాంతి సినిమా అని ఫిక్స్ అయిపోయాను.
అంతేకాకుండా మన తెలుగు తమ్ముళ్లు పక్కా పల్లె సినిమాలను బాగా చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పండుగ సందర్భంగా తమతమ సొంతూర్లకి వెళ్లి ఉంటారు. దాంతో పాటుగా సంక్రాంతికి సినిమా చూడటం అనేది అలవాటు కాదు.
నాకు తెలిసినంతవరకు ఇది మన సాంప్రదాయంలా మారింది. అది కూడా ఒక్క సినిమా కాదు. మూడు సినిమాలను చూస్తారు. వాటన్నింటితో పాటుగా సంక్రాంతి అనేది దాదాపు రూ.400-450 కోట్ల బిజినెస్ చేస్తుంద’ని నాగ్ చెప్పుకొచ్చాడు.
దీంతో అభిమానులకు ఓ క్లారిటీ వచ్చింది. ‘బంగార్రాజు’ సంక్రాంతి సినిమా అనే నాగ్ రిలీజ్‌కు రెడీ అయ్యాడని తెలుస్తోంది. మరి నాగ్ ఆశించిన స్థాయి బిజినెస్ సినిమా చేస్తుందో లేదో చూడాలి.
#Bangarraju# Nagarjuna# sankranthi