Pakka Commercial | ఒక్క పాటకి ఒకటిన్నర కోటి.. ‘పక్కా కమర్షిల్’గా సినిమా..

Pakka Commercial సినిమాల్లో సన్నివేశాలతో పాటు పాటలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కేవలం పాటలతోనే హిట్|

Spread the love
Pakka Commercial

సినిమాల్లో సన్నివేశాలతో పాటు పాటలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కేవలం పాటలతోనే హిట్ అందుకున్న సినిమాలు ఉన్నాయి. అందుకనే సినీ మేకర్స్ పాటల విషయంలోనూ తగ్గేదే లే అంటుంటారు. అలాగని పాటలకి కోట్లు కుమ్మరించరు. అయితే ఇటీవల ఓ సినిమా మేకర్స్ ఒక్కపాటకి దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు పెట్టారట.

ఈమేరకు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా ఏదో కాదండీ.. ప్రస్తుతం సరైన్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ‘ఆరడుగుల బెల్లెట్’ గోపీచంద్ తాజా సినిమా ‘పక్కా కమర్షియల్’. ఈ సినిమాలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటిస్తుండగా.. ఈ సినిమాలోని ఓ పాట కోసం మేకర్స్ రూ.1.5 కోట్లు ఖర్చు చేశారంటూ సినీ సర్కిల్స్ టాక్ నడుస్తోంది.

ఈ పాట కోసం డైరెక్టర్ మారుతి భారీ సెట్ ప్లాన్ చేశాడని, అందుకనే ఇంత బడ్జెట్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *