

Mahesh | మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు సర్కారు వారు నిరాశ మిగిల్చారు.
ఈ ఏడాది సమ్మర్‌కి పక్కా అనుకుంటే అది కూడా అంతే వెనక్కి వెళ్లింది. దేశంలో కరోనా విజృంభించడం, మహేష్‌కు కరోనా పాజిటివ్‌గా రావడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే వారి నిరాశను పటాపంచెలు చేయడానికి సర్కారు వారు రెడీ అవుతున్నారట.
సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారట. ఈ మేరకు సోషల్ మీడియా కోడై కూస్తోంది. దాంతో పాటుగా ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ఫిక్స్ చేసేశారని, వ్యాలంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని టీం ఫిక్స్ అయిందట.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
#Mahesh #Sarkaaru vaari paata #first single