

Mahesh | టాలీవుడ్ అగ్రహీరో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు. దుబాయ్‌లోని రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి న్యూఇయర్ జరుపుకున్నాడు.
అయితే క్రిస్మస్ వేడుకలకోసం దుబాయ్ వెళ్లిన మహేష్ న్యూ ఇయర్ వరకు అక్కడే ఉన్నాడు. తన స్నేహితుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీతో కలిసి మహేష్ ఈ వేడుకలు జరుపుకున్నాడు.
డిన్నర్ అనంతరం ఇరు కుటుంబాలు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రత తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుంది.
మహేష్ కూడా బుర్జ్ ఖలీఫా వద్ద దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
#Mahesh #Namratha #NewYear