

Mahesh Babu | యంగ్ ఎన్‌టీఆర్ హోస్ట్ చేస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ షో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ప్రిన్స్ మహేష్ బాబు ఈ షోకు గెస్ట్‌గా రావడమే ఇందుకు కారణం. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఎటువంటి అప్‌డేట్ వచ్చినా అతి తక్కువ సమయంలోనే హల్‌చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌పై నెటిజన్లలో కొత్త సందేహాలు వస్తున్నాయి.
ఇందులో మహేష్ ఎంత గెలుస్తాడు, ఎలా ఆడతాడు అని అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా మహేష్ దాదాపు రూ.25 లక్షలు గెలుచుకునున్నాడంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాకుండా ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ లైఫ్‌లైన్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఫోన్ చేస్తాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే.