

Mahesh Babu | మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న ఓ నిర్ణయం మహేష్‌బాబును అప్‌సెట్ చేసిందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. దీనిపై ఫ్యాన్స్ మధ్య కూడా విభేదాలు వస్తున్నాయని టాక్ వస్తోంది. అయితే ఇదంతా సినిమా రిలీజ్ గురించి వచ్చిందట. కరోనా సమయంలో పోటీ ఉండకూడదన్న ఆలోచనతో హీరోలు తమ సినిమాల విడుదల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం సంక్రాంతి బరి నుంచి పలు సినిమాలు తప్పుకున్నాయి. వాటిలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఒకటి. ఆ తర్వాత మహేష్ తన సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలన్న ఆలోచనతో మేకర్స్‌తో చర్చలు చేస్తున్నాడని టాక్ వస్తోంది.
ఇదే సమయంలో చిరంజీవి కూడా తన ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయాలని మేకర్స్‌తో మాట్లాడుతన్నాడట. దీంతో చిరు నిర్ణయంపై మహేష్ అప్‌సెట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి.
కానీ ఇప్పటి వరకు వీరిలో ఏఒక్కరూ ఏప్రిల్ 1న సినిమా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. మరి వీరిలో ఎవరి సినిమా ఏప్రిల్ 1న వస్తుందో చూడాలి.
#Mahesh #Chiranjeevi #Acharya #SarkaruVaariPaata