

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా సోకింది. గురువారం నాడు ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు మహేష్ బాబు ఒక ట్వీట్ చేశారు. తను ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు.
‘‘అందరూ అర్జెంటుగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరోనా తీవ్రత, ఆస్పత్రి పాలయ్యే అవసరం చాలా వరకు తగ్గుతుంది’’ అని ఆయన చెప్పారు. తాను డాక్టర్లను సంప్రదించానని, వారు చెప్పిన గైడెన్స్ తీసుకుంటున్నానని వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వాళ్లందరూ కరోనా టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు.
ఇటీవలే కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకునేందుకు ఆయన కుటుంబంతో కలిసి దుబాయ్ ట్రిప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, మహేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆయన నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఈ సంక్రాంతికి అభిమానుల ముందుకు రావలసింది. కానీ కుదరలేదు. త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా చేస్తాడని కూడా సమాచారం.
1 thought on “Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా!”