

సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటేనే అభిమానుల్లో తెలియని కొత్త ఉత్తేజం వస్తుంది. సినిమాలో ఎటువంటి ఎలిమెంట్ మిస్ అవ్వదని అభిమానులు కాలరెగరేసి చెప్పుకుంటారు. అయితే కెరీర్ ప్రారంభంలో ప్రయోగాలు కేరాఫ్‌గా నిలిచిన మహేష్ ఇప్పుడు ప్రయోగాలు ఆమడ దూరం నిలుస్తున్నాడు. కానీ కమర్షియల్‌గా మాత్రం అందరినీ అలరించి హిట్లు అందుకుంటున్నాడు.
ఇటీవల ఎన్‌టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న షోకు వచ్చిన మహేష్ తన సక్సెస్ వెనుక కారణాన్ని చెప్పేశాడు. తన కెరీర్ ప్రారంభంలో నాని, నిజం అని విమర్శకులు ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఆ సినిమా ప్రేక్షకులను అలరించడంలో అనుకున్నంతగా రాణించలేదు. ఆ తరువాత చాలా సంవత్సరాల తరువాత చేసిన ‘1 నేనొక్కడినే’ కూడా అంతే.
అందుకనే తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదనే తాను ప్రయోగాలకు దూరంగా ఉంటున్నానట్లు మహేష్ తెలిపాడు. అయితే ప్రయోగాలు ఎందుకు చేయడంలేదని ఎన్‌టీఆర్ అడిగిన ప్రశ్నకి.. నిర్మాతలను నష్టాల్లో పడేయలేక అని ముక్తసరిగా, ముక్కుసూటిగా సమాధానం ఇచ్చాడు. అందుకనే కమర్షియల్ కథలతో హిట్ డైరెక్టర్స్‌నే ఎంచుకుంటున్నట్లు మహేష్ తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా తెరరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేంందుకు సిద్దం చేస్తున్నారు.
1 thought on “Mahesh Babu | సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన సూపర్ స్టార్ మహేష్..”