

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు హఠాన్మరణం సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా రమేశ్ బాబు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా వెండితెరకు పరిచయమైన రమేశ్ బాబు.. హీరోగా సక్సెస్ చూడలేకపోయారు. దీంతో వెండితెరకు దూరమైనా నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించారు.
ఆయన శనివారం నాడు హఠాన్మరణం చెందారు. అయితే ప్రస్తుతం కరోనా సోకి ఐసొలేషన్‌లో ఉన్న మహేశ్ బాబు.. సోదరుడి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేని పరిస్థితి. ఈ క్రమంలోనే తన అన్నయ్య మృతిపై భావోద్వేగానికి గురైన మహేశ్ ఒక ట్వీట్ చేశారు. ‘‘నా స్ఫూర్తి, బలం, ధైర్యం అన్నీ నువ్వే. నువ్వు లేకుంటే నేనిప్పుడు ఉన్న వ్యక్తిలో సగం కూడా అయ్యుండేవాడిని కాదు.
నాకోసం నువ్వు ఎంతో చేశావు. దానికి ధన్యవాదాలు. ఇక విశ్రాంతి తీసుకో. ఈ జీవితంలో, నాకంటూ మరో జన్మ ఉంటే అందులో కూడా ఎల్లప్పుడూ నువ్వు నాకు అన్నయ్యవే. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో నూతన సంవత్సర వేడుకల కోసం మహేశ్ బాబు కుటుంబం దుబాయ్ వెళ్లింది. ఆ తర్వాత తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.
మహేశ్‌కు కరోనా అని తెలిసిన మరుసటి రోజే రమేశ్ బాబు కన్నుమూశారు. దీంతో కరోనా నిబంధనల కారణంగా మహేశ్ బాబు.. తన సోదరుడి అంత్యక్రియలకు హాజరవడం కుదరదు.
Mahesh babu, tollywood, shocking
1 thought on “Mahesh Babu | మరో జన్మలో కూడా అన్నయ్య నువ్వే.. ఇక విశ్రాంతి తీసుకో: మహేశ్ భావోద్వేగ ట్వీట్”