Prabhas | ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. సీక్రెట్ చెప్పేసిన నిర్మాత..

Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 5 సినిమాలను చేస్తున్నాడు. అయినప్పటికీ మరికొందరు దర్శకనిర్మాతలు..

Spread the love
Prabhas

Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 5 సినిమాలను చేస్తున్నాడు. అయినప్పటికీ మరికొందరు దర్శకనిర్మాతలు ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ సినిమాలను లైన్లో పెట్టాడు.

వీటిలో మూడు సినిమాలను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ నిర్మిస్తోంది. అయితే తాజాగా టీ-సిరీస్ చైర్మన్ భూషణ్ ప్రభాస్ సినిమా నుంచి ఓ సీక్రెట్‌ను చెప్పేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూషన్ నోరుజారి సినిమా సీక్రెట్ చెప్పేశారు.

ఇది కూడా చదవండి: RGV | వర్మకు ‘మెగా’ సపోర్ట్.. నా మనసులో మాటంటూ..

‘జెర్సీ సినిమాతో సందీప్ ఉత్తరాది ప్రేక్షకుల నాడీ కనిపెట్టాడు. కాబట్టి స్పిరిట్‌తో మరింత ఆకట్టుకుంటాడు. ఎంతైనా ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు కదా’ అంటూ భూషణ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా పూర్తిచేసిన తర్వాత సందీప్ వంగ ‘స్పిరిట్’ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్‌పై క్లారిటీ రావాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.
#Prabhas #SandeepReddyVanga #Spirit #Animal

Spread the love

1 thought on “Prabhas | ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. సీక్రెట్ చెప్పేసిన నిర్మాత..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *