

NTR | యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే కొరటాల శివ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం కొరటాల కూడా ఎన్‌టీఆర్‌తో చేయనున్న సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడట.
ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తి చేయాల్సి ఉందట. తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్‌కు సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్‌టీఆర్ కోసం కొరటాల రివేంజ్ స్టోరీ రెడీ చేస్తున్నాడట.
ఇందులో ఎన్‌టీఆర్ పక్కా స్మార్ట్ అండ్ హీరోయిక్ స్వాగ్‌తో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కొరటాల ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
సినీ సర్కిల్స్‌లోనూ వీరి కాంబో మూవీనే చర్చగా మారింది. ఈ సినిమాలో ఎన్‌టీఆర్ డాన్స్‌కు కూడా భారీ స్కోప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
#NTR #Koratala shiva