

Jaggu Bhai | జగపతి బాబు హీరోగా ఉన్నప్పటి కంటే విలన్ పాత్రలు చేస్తున్నప్పుడే ఎక్కువ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. జగ్గూ భాయ్ విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. జగ్గూ భాయ్ స్వాగే అసలు వేరంటూ అయ్యగారిని ప్రశంసలతో ముంచెత్తారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగ్గూ భాయ్ షాకింగ్ విషయాలు చెప్పాడు. ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఇండస్ట్రీలో ఒక్కడూ లేడంటూ జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో మీకున్న మంచి స్నేహితులు ఎవరు అన్న ప్రశ్నకు జగ్గూ భాయ్ ఈ సమాధానం ఇచ్చారు.
‘ఇండస్ట్రీలో ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఒక్కడూ లేడు. ప్రతి ఒక్కరూ తమ అవసరం ఉన్నంత వరకే. ఆ తరువాత టాటా బైబై చెప్పేస్తారు. కానీ అర్జున్‌తో మాత్రం మంచి అనుబంధం ఉంది. అతడితో నాకు తరచుగా గొడవ అవుతుంటుంది. కానీ అది స్నేహపూర్వకంగానే.
కానీ చూసే వారికి మాత్రం మేము పెద్దగా కేకలు వేసుకుంటున్నట్లు ఉంటుంది’ అని జగ్గూ భాయ్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిపై కొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అయితే మరికొందరు నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.
#JagapathiBabu #FilmIndustry #Arjun #Friends #JagguBhai