

Pushpa | అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సంచలనం సృష్టిస్తున్నాడు. ప్రారంభంలో సినిమా వసూళ్లు అంతగా లేకపోయినా ప్రస్తుతం సినిమా దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను చూసి సినీ తారలు బన్నీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఈక్రమంలోనే మహేష్ బాబు కూడా సంచలన కామెంట్స్ చేశాడు. ఆ వర్గం వేరని బన్నీ నిరూపించాడంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ‘పుష్పలో బన్నీ నటన, గెటప్ అద్దిరిపోయాయి. ఇక పూర్తి సినిమా విషయానికొస్తే అద్భుతంగా ఉంది.
ఇది కూడా చదవండి: Prabhas | ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. సీక్రెట్ చెప్పేసిన నిర్మాత..
ఈ సినిమాతో ఓ వర్గం వారు వేరని సుకుమార్ చాలా మోటుగా, పచ్చిగా, క్రూరంగా నిరూపించాడు. ఇక డీఎస్‌పీ మ్యూజిక్ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేద’ని మహేష్ ట్వీట్ చేశారు. చివరిగా పుష్ప టీం మొత్తానికి అభినందనలు తెలిపాడు.
#MaheshBabu #Pushpa #AlluArjun #Sukumar #DSP
1 thought on “Pushpa | బన్నీపై మహేష్ సంచలన కామెంట్స్.. ఆ వర్గం వేరంటూ..”