

Sukumar | సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సుక్కు సినిమా అంటేనే కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ప్రతి అంశాన్ని కూడా పక్కాగా చూపించే సుక్కు ‘పుష్ప’ సినిమాతో ఇండియా రేంజ్‌లో తన మార్క్ చూపించాడు.
ఇటీవల పుష్ప సక్సెస్ సందర్భంగా బాలీవుడ్‌తో ముచ్చటించిన సుక్కు తన మనసులో మాట చెప్పేశాడు. తనకు అవకాశం వస్తే బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్‌తో సినిమా చేస్తానని అన్నాడు.
అది కూడా అక్షయ్ అడిగాడట. ‘నేను పుష్ప షూటింగ్‌లో ఉన్నప్పుడు అక్షయ్ కుమార్ నాకు ఫోన్ చేశాడు. తనతో ఓ సినిమా చేయాలని అడిగాడు. అందుకనే అతడితో నేను ఓ సినిమా ఖచ్చితంగా చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు.
మరి పుష్ప తర్వాత చేయాల్సిన రెండు సినిమాలు కంప్లీట్ చేసి ఖిలాడీ సినిమాను స్టార్ట్ చేస్తాడా, ఈ మధ్యలోనే బాలీవుడ్‌ను షేక్ చేసి వస్తాడా అన్నది చూడాలి.
#sukumar #Pushpa #akshay kumar #Bollywood