

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో నెవ్వర్ బిఫోర్ అనేలా మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ కూడా ఔరా అనిపించింది. వీటన్నింటితో పాటు ఇటీవల వచ్చిన ట్రైలర్ కళ్ల పండుగలా ఉంది.
ఈ క్రమంలో మూవీ మేకర్స్ చెన్నైలో ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి.. తాను మహేష్‌తో చేయనున్న సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను ప్రస్తుతం మహేష్ గురించి అస్సలు ఆలోచించడం లేదని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘నేను మహేష్‌తో సినిమా చేయనున్న విషయం నిజమే.
కానీ ప్రస్తుతం నేను ఆ సినిమా గురించి అస్సలు ఆలోచించడం లేదు. నా దృష్టంతా ఆర్ఆర్ఆర్ పైనే ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాతే మహేష్ సినిమా గురించి ఆలోచిస్తా’ అని రాజమౌళి అన్నాడు. దీనిపై కొందురు కోపగించుకుంటున్నప్పటికీ, కొందరు మాత్రం జక్కన్న డెడికేషన్‌కి జోహార్లు కొడుతున్నారు.
Rajamouli, Mahesh babu, NTR, Ram Charan, RRR,