

Liger | రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న తాజా సినిమా ‘లైగర్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి ఎప్పుడు అప్‌డేట్స్ వస్తాయా ఆని అందరూ ఆరాటంగా ఎదురుచూస్తున్నారు.
అయితే బుధవారం బాలీవుడ్ ఫేమస్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ చేతులు మీదుగా ఓ అప్‌డేట్ వచ్చింది. న్యూఇయర్‌కు అదిరిపోయే అప్‌డేట్స్ ఉందని మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో ‘లైగర్’ వేట మొదలెట్టిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా డిసెంబర్ 29న స్పెషల్ స్టిల్స్, డిసెంబర్ 31న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మరి వారి అంచనాలకు తగ్గట్టుగా అప్‌డేట్స్ ఆకట్టుకుంటాయేమో వేచి చూడాలి.
#Liger, #VijayDevarakonda, #PuriJagannath,