

Bheemla Nayak | ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో ఎటు చూసినా ‘భీమ్లా నాయక్’ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ‘భీమ్లా నాయక్’ హాట్ టాపిక్‌గా ఉంది. అందుకు అభిమానులే కారణం. ‘భీమ్లా నాయక్’కు ఊపిరాడకుండా చేసేస్తున్నారు.
సినిమాను సంక్రాంతి బరిలో ఉంచాలంటూ మేకర్స్‌పై ఒత్తిడి తెస్తున్నారు. మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ముందుగా ‘భీమ్లా నాయక్’ను సంక్రాంతి బరి నుంచి తప్పించి స్లాట్ బుక్ చేసుకుంది. కానీ దేశంలోని పరిస్థితుల కారణంగా సంక్రాంతి బరి నుంచి ఆర్ఆర్ఆర్ తప్పుకుంది.
దీంతో సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు లేక బోసిపోయిందని, ‘భీమ్లా నాయక్’ను బరిలోకి దించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన మేకర్స్ ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి రాడని అంటున్నారు.
దేశ పరిస్థితులు, ఏపీలో టికెట్ రేట్లు ‘భీమ్లా నాయక్’ వసూళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, అందుకనే పరిస్థితులను బట్టి ‘భీమ్లా నాయక్’ వస్తాడని మేకర్స్ తెలిపారు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మరి వారికి ఊరటనిచ్చేందుక ‘భీమ్లా నాయక్’ ఏదైనా అప్‌డేట్ ఇస్తాడేమో చూడాలి.
#Bheemla nayak# pawan kalyan# sankranthi