

F3 vs RRR | ‘ఎఫ్3’ మేకర్స్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. తమ సినిమా ఆలస్యమే అందుకు కారణం. ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ ఎటువంటి పోటీ ఉండకూడదని చూస్తున్నారు. కానీ ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేద్దామనుకున్నా ఆ డేట్ మరో సినిమా వచ్చి ఆక్రమిస్తోంది.
దీంతో ఇటీవల మేకర్స్ ‘ఎఫ్3’ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాకు అడ్డుపడుతోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ మేకర్స్ చేసిన ప్రకటనలో పరిస్థితులు సర్దుమణిగితే ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని తెలిపారు.
దీంతో ఇప్పుడు ‘ఎఫ్3’ మేకర్స్ సందిగ్దంలో పడ్డారు. చిన్న సినిమాలతో సైతం పోటీ వద్దనుకుంటున్నా మేకర్స్ ఇండియాస్ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీతో పోటీ పడేందుకు ఇష్టపడరు. మరి ఈ విషయంలో ‘ఎఫ్3’ మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
#RRR #F3 #NTR #RamCharan #F3vsRRR