

Akkineni | బిగ్ బాస్ షోకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఫేమస్ అయినా కొందరు మాత్రం అలా గుర్తుండిపోతారు. వారిలో బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ లహరి కూడా ఉంటుంది. బిగ్ బాస్5తో స్టార్ అయిన అమ్మడు తాజాగా చేసిన ఇన్‌స్టాపోసట్ ప్రస్తుతం సోషల్ మీడియాను చుట్టేస్తోంది.
తన కల నెరవేరిందని, ఆయనతో ఒకరోజు గడిపానని అమ్మడు తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. టాలీవవుడ్ మన్మథుడు, నవ మన్మథుడు అయిన నాగార్జున, నాగచైతన్యతో ఒక రోజంతా గడపాలన్నది అమ్మడి కోరికని తెలిపిన లహరి.. తన కోరికను అక్కినేని తండ్రీకొడుకులు తీర్చారని తెలిపింది. ఈ పట్టరాని సంతోషాన్ని తన సోషల్ మీడియాలో ఓ ఫొటో ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఇది కూడా చదవండి: Ram Charan | ‘శ్యామ్ సింగరాయ్’ ఓ గొప్ప అనుభూతి.. రాం చరణ్ ట్వీట్ వైరల్
‘కల కంటే అది నిజంగా నిజమవుతుంది. నేను కన్న కల 2022 జనవరి 7న నెరవేరింది. మీలాంటి గొప్ప వ్యక్తులతో ఒక రోజంతా గడిపేందుకు అవకాశం ఇచ్చినందుకు అక్కినేని నాగచైతన్య, నాగార్జున గారికి ధన్యవాదాలు’ అని లహరి తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ ఫొటోలో అక్కినేని ప్రైవేట్ జెట్‌లో నాగార్జున, నాగచైతన్యతో కలిసి పోజ్ ఇచ్చింది.
#Lahari, #Nagarjuna, #NagaChaitany, #BiggBoss
1 thought on “Akkineni | అక్కినేని హీరోలు నా కోరిక తీర్చారు.. బిగ్‌బాస్ లహరి”