

Samantha | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎటు చూసినా సమంతనే హాట్ టాపిక్‌గా కనిపిస్తోంది. అమ్మడు ఏం చేసినా అది వైరల్ అవుతోంది. అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
ఆ వీడియో కింద 80 కిలోలకు చేరుకున్నానంటూ సమంత రాసుకొచ్చింది. అయితే సాధారణంగా సమంత ఎంత ఫిట్‌నెస్ ఫ్రీక్ అనేది అందరికీ తెలుసు. కానీ పెళ్లైన తర్వాత సామ్ జిమ్‌కు కాస్త దూరం పాటించింది.
ఇటీవల డైవర్స్ కావడంతో మళ్లీ తన టోన్డ్ బాడీ కోసం కసరత్తులు స్టార్ట్ చేసింది. ఇది వరకు 100-115 కిలోల బరువులు ఎత్తే సామ్ ఇప్పుడు మళ్లీ 75 నుంచి మొదలైంది. అక్కడి నుంచి తాజాగా 80 కిలోల మార్క్‌ను అందుకుంది.
ఈ సందర్భంగా తన ట్రైనర్ జునైద్‌తో కలిసిన వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసుకుంది. ఈ వీడియోలో 80 కిలోల బరువు ఎత్తి సమంత ఖుష్ అవ్వడం మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
#Samantha #gym #workout