

Brahmastra | లవ్‌బర్డ్స్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌కు ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ షాక్ ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి కనిపించకూడదని షరతు పెట్టాడు. అయితే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో వీరిద్దరు హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా 2017లో ప్రారంభమైంది.
ఈ టైంలో వారిద్దరూ చాలా దగ్గరయ్యారు. కాబట్టి ఇకపై వారిద్దరూ కలిసి కనిపించకూడదని, బయటకు కూడా వెళ్లకూడదని సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ షరతు పెట్టాడు. ‘వీరిద్దరినీ మరో నాలుగేళ్లపాటు ప్రపంచం చూడకూడదని భావించాను. ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్‌తోనే వారిని అందరూ చూడాలని కోరుకున్నా. కానీ కుదరలేదు. కాబట్టి ఇకనుండి వీరిద్దరు కలిసి ఎవరికి కనిపించకూడదని. ‘బ్రహ్మాస్త్ర’ విడుదలైన తరువాతే వీరిద్దరు బయటకి వెళ్లాలి’ అని అయాన్ అన్నాడు.
vదీంతో లవ్‌బర్డ్స్‌కి షాక్ తగిలిందనే చెప్పాలి. వారితోపాటుగా ఫ్యాన్స్‌కూ ఇది షాకింగ్ వార్తే. అలియా, రణ్‌బీర్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో అయాన్ షరతు వారి పెళ్లిని వాయిదా వేస్తుందని అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.
#RanbirKapoor #AliaBhatt #AyanMukharji #Brahmastra,