

Mahesh | మహేష్ అచంట ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జబర్దస్త్ షోతో ప్రేక్షకులను పరిచయం అయిన మహేష్ తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు కూడా అందుకున్నాడు. కొన్ని సినిమాల్లో కమెడియన్‌గా కనిపించినా కేవలం దానికే పరిమితం కాలేదు. కొత్త పాత్రలకు ప్రయత్నిస్తూ వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్నాడు.
అయితే తాజాగా యంగ్ హీరో శ్రీవిష్ణు అప్‌కమింగ్ మూవీ ‘అర్జున ఫల్గుణ’ సినిమాలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 31 విడుదల కానుండగా మూవీ ప్రమోషన్స్‌లో టీమ్ బిజీ అయిపోయింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను చేసిన ఓ పాత్ర దెబ్బకి అదే తన చివరి సినిమా అవుతుందని భయపడ్డానని అన్నాడు.
అదే మరేదో సినిమా కాదు. సామిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’. ఆ సినిమాలో మహేష్ సావిత్రిని మోసం చేసి, ఆమె ఆస్తిని కాజేసే సత్యం పాత్రలో నటించాడు. దాని గురించి మాట్లాడుతూ.. ‘ఆ సినిమా తరువాత నేను ఊరికి వెళ్లాను అక్కడి వారంతా నన్ను అదోలా చూస్తూ తిట్టిపోశారు. కొందరైతే నీకేం పోయే కాలం రా.. సావిత్రమ్మని మోసం చేశావ్ అన్నారు. కొందరిని చూస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అన్న భయం కూడా కలిగింది. కానీ వారు ఆ పాత్రకి అంతలా కనెక్ట్ అయ్యారు.
ఇక ఇప్పుడు అర్జున ఫల్గుణ సినిమాలో నా పాత్ర కెరీర్ బెస్ట్ కానుంద’ని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సినిమా చాలా ఆసక్తిగా సాగుతుందని, ఎక్కడా బోర్ కొట్టదని చెప్పుకొచ్చాడు. మరి సినిమా ఏమాత్రం అలరిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 31 వరకు వేచి చూడాల్సిందే.
#Mahesh #SreeVishnu #ArjunaPhalguna #Mahanati