

Acharya | మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాకు సక్సెస్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని దాదాపు ఫైనల్ కాపీ కూడా రెడీ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆచార్య టీమ్ కీలక నిర్ణయం తీసుకుందట. సినిమాలోని కొన్ని సన్నివేశాలని రీషూట్ చేయాలని, డైలాగ్స్‌ని మరింత పవర్ ఫుల్‌గా మార్చాలని చిరు టీమ్‌ని కోరాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఆచార్య దేవుడు, దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. ఇదే థీమ్‌తో వచ్చి ‘అఖండ’ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. దీంతో చిరు కూడా అదే స్థాయిలో యాక్షన్, డైలాగ్స్ ఉండాలని భావిస్తున్నాడట. ఇందుకోసమే మరో 24 రోజుల పాటు రీషూట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. మరి రీషూట్ తర్వాతైనా చిరు ఆశించిన స్థాయిలో సినిమాలో మాస్ ఎలిమెంట్స్ చేరతాయా అనేది చూడాలి.
అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ‘అఖండ’ రేంజ్‌లో ‘ఆచార్య’ ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.
#Chiranjeevi #Acharya #Akhanda #Balakrishna