

South Cinema | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హిట్ సాధించాడు. ఈ ఏడాది కరోనా టైంలోనూ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వరద పారించిన రెండు సినిమాలు టాలీవుడ్‌వే కావడం విశేషం.
దీంతో దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీల కళ్లన్నీ దక్షిణాది వైపు తిరిగాయి. దీంతో దక్షిణాది సినిమాలకు ఉత్తరాదిలో గిరాకీ పెరిగింది. అయితే ఓ నిర్మాత ఇదే మంచి అదును అనుకున్నాడు. సౌత్‌లో భారీ హిట్ అయిన సినిమాల హక్కులను సొంతం చేసుకుని వాటిని ఉత్తరాదిలో రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.
వాటిలో 2020 టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను జనవరి 26న నార్త్ బెల్ట్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ చేశారు. ఈ సినిమాతో పాటు మెగాపవర్ స్టార్ రాంచరణ్ హిట్ మూవీ ‘రంగస్థలం’ సినిమాను కూడా నిర్మాత రెడీగా ఉంచాడు.

ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని పక్కా ప్లాన్ చేస్తున్నారట. వీటన్నింటితో పాటు తమిళ సినిమాలు మెర్సల్, విశ్వాసం హక్కులను కూడా నిర్మాత మనిష్ షా, అతడి టీం సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఉత్తరాదిలో అక్కడి సినిమాల పరిస్థితి చూస్తుంటే ఉత్తరాది థియేటర్లకు దక్షిణాది సినిమాలు కొత్త జోష్ ఇస్తున్నట్లు ఉంది. అంతేకాకుండా ఉత్తరాదిలో దక్షిణాది సినిమాలు చక్రం తిప్పుతున్నట్లు కనిపిస్తోంది. మరి బన్నీ, చెర్రీ సినిమాలు మరోసారి ఉత్తరాదిలో బంపర్ హిట్‌లు అవుతాయేమో చూడాలి.
#allu arjun #ram charan #rangastalam #north belt