

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబోల పేర్లు చెబితేనే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ఈ జాబితాలో బాలయ్య-బోయపాటి కాంబో టాప్‌లో ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. అయితే వీరి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు బంపర్, బ్లాక్ బస్టర్ హిట్ కాగా. ఇప్పుడు ‘అఖండ’తో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే అభిమానులు పూనకాలు పుట్టిస్తోంది. ఇక ఈ విడుదల డిసెంబర్ 2 కానుండగా.. ఆ రోజు రాష్ట్రమంతా జాతర్ల కావడం పక్కా అని బాలయ్య అభిమానులు ఫిక్స్ అయ్యారు. అయితే శనివారం జరిగిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ పెద్ద జాతరలా జరిగింది. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు.
ఇది కూడా చదవండి: Sirivennela | కిమ్స్ ఆసుపత్రిలో సీతారామ శాస్త్రి.. తీవ్ర అస్వస్థతే కారణం..
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘ బాలయ్య ఓ ఆటంబాంబు లాంటివాడు. అతడిని ఎక్కడ, ఎలా వాడుకోవాలో బోయపాటికే తెలుసు. బాలయ్య సీక్రెట్‌ను బోయపాటి ఒక్కడే ఉంచుకుంటే కుదరదు అందరికి చెప్పాలి. అఖండ సినిమాతో ఇండస్ట్రీకి ఊపు ఊపు తీసుకొచ్చేందుకు కృతజ్ఞతలు’ తెలిపారు. అనంతరం ఈ సినిమాలో ఉన్న ఒకేఒక డ్యూఎట్‌ను రిలీజ్ చేసి ఇది కేవలం శాంపిల్ మాత్రమే, బిగ్ స్రీన్‌పై చూస్తే బొమ్మ అదిరిపోద్ది, థియేటర్ దద్దరిల్లి పోతుందని అన్నారు. అంతేకాకుండా ‘నేను ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తా.. సినిమా పెద్ద హిట్ అవుతుంది, కావాలి’ అని అన్నారు.
1 thought on “Akhanda | బాలయ్య సీక్రెట్ బోయపాటికే తెలుసు.. స్టార్ డైరెక్టర్”