

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా పవన్ కెరీర్‌లో తెరకెక్కుతున్న మొట్టమొదటి పీరియాడికల్ సినిమాగా కూడా ఈ చిత్రం క్రేజ్ అందుకుంది. ఈ సినిమాలో ‘వీర మల్లు’ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. అతడి సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది.
అయితే ఈ సినిమా శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండజ్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనుందని వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాలో జాక్వెలిన్ నటించడం లేదని దర్శకుడు క్రిష్ కుండబద్దలు కొట్టాడు. కానీ ఈ సినిమాలో వేరే బీ టౌన్ బ్యూటీ నటిస్తోందని చెప్పాడు.
దీంతో ఇప్పుడు ఆ బీటౌన్ బ్యూటీ ఎవరన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్. తాజాగా ‘నర్గిస్ ఫక్రి’ ఈ సినిమాలో చేస్తుందంటూ టాక్ వినిపిస్తోంది. అదే విధంగా సినీ సర్కిల్స్‌లోనూ ఇదే టాక్ చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.
#Bollywood# Tollywood# Pawan kalyan# HariHara veeramallu# krish