

Tollywood | మెగా, నందమూరి ఫ్యామీలీల మధ్య వైరం ఇప్పటి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఈ వైరానికి తెరపడుతుందని అందరూ భావించారు. కానీ తాజాగా మెగాస్టార్‌తోనే.. బాక్సాఫీస్ వద్ద ఫైట్‌కు రెడీ అవుతున్నాడు.
అయితే మెగాస్టార్ అప్‌కమింగ్ మూవీ ‘ఆచార్య’ను మేకర్స్ ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇదే డేట్‌కు నందమూరి హీరో కూడా తన సినిమా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాడట.
అతడెవరో కాదు నందమూరి కల్యాణ్ రామ్. కల్యాణ్ రామ్ తన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ సినిమాను ఏప్రిల్1 విడుదల చేయాలని చూస్తున్నాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీంతో మళ్లీ మెగా vs నందమూరి వార్ షురూ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే ఈ డేట్‌ను మిస్ అయ్యేందుకు ఇద్దరు హీరోలు సిద్ధంగా లేరని, కాబట్టి బాక్సాఫీస్ ఫైట్ తప్పదని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
#Bimbisara #Acharya #Chiranjeevi #KalyanRam