

chatrapathi | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌పై దృష్టి పెట్టాడు. బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్‌గా ఇచ్చేందుకు ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా హిందీ రీమేక్‌ను పెన్ స్టూడియోస్ పతాకంపై వివి వినాయక్ తెరకెక్కిస్తున్నాడు.
అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి సరైన అప్‌డేట్ రాలేదు. తాజాగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చేందుకు పెన్ స్టూడియోస్ వారు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా కోసం బెల్లంకొండ బీస్ట్‌మోడ్‌లో కనిపించనున్నాడట. అదే రేంజ్ అప్‌డేట్ ఇచ్చేందుకు మేకర్స్ అంతా రెడీ చేశారట.
బీస్ట్ మోడ్‌లో ఉన్న బెల్లం కొండ పోస్టర్‌ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ పోస్టర్‌లో శ్రీనివాస్ గడ్డంతో మాస్ అండ్ క్లాస్‌గా కనిపించనున్నాడని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే పోస్టర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే.
#chatrapathi #bellamkonda srinivas #Bollywood #VV Vinayak