Actress | పొదల్లో నటి డెడ్‌బాడీ.. భర్తే చంపి గోనె సంచిలో కుక్కి..

Actress
Missing Bangladeshi Actress Raima Islam Shimu body found in a sack |  husband confesses to murder | Bangladesh

Actress | స్టార్ నటి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. నటి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అనుమానంతో ఆమె భర్తను విచారించగా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది.

బంగ్లాదేశీ స్టార్ హీరోయిన్ రైమా ఇస్లాం షిము గతకొన్ని రోజులుగా కనిపించడం లేదని ఆమె భర్త షకావత్ అలి నోబెల్ పోలీసులను ఆశ్రయించాడు.

Missing Bangladeshi Actress Raima Islam Shimu body found in a sack |  husband confesses to murder | Bangladesh

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ధాకా కెరానిగంజ్ ఏరియాలోని ఓ బ్రిడ్జ్ సమీపంలో ఓ గోనె సంచి అనుమానం కలిగించడంతో పోలీసలు తెరిచి చూశారు. గోనె సంచిలో రైమా మృతదేహం కనిపించింది.

ఆమె శరీరంపై గాయాల గుర్తులు ఉండటంలో పోలీసులు అలీని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు తన తప్పును అంగీకరించడంతో పోలీసులు అతడిపై కేసు నమోద చేసి అరెస్ట్ చేశారు.

#Bangladesh #actress #Police

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *