

Balayya | ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న పాన్ ఇండియా ఫీవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ తమ సినిమాలతో సత్తా చాటారు. ఇక ఎన్‌టీఆర్, రాం చరణ్ తమ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాధించారు.
ఒక్కసారి సినిమా విడుదలైతే వారి రేంజ్ వేరే లెవెల్‌లో ఉండటం ఖాయం. వీరిలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకడు. ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియాకు గురిపెట్టాడు. తాజాగా బాలయ్య కూడా పాన్ ఇండియాపై కన్నేశాడు.
నందమూరి నటసిహం బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో అఖండ విజయం సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాడు. ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న బాలయ్య మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ‘క్రాక్’ సినిమాతో కిర్రాక్‌పుట్టించిన గోపీచంద్‌తో జతకట్టాడు.
గోపీచంద్ డైరెక్షన్‌తో బాలయ్య తన నెక్స్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడు. గోపీచంద్ మలినేనితో తాను చేయనున్న సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. కేవలం తెలుగు సినిమా అనే చేసిన ‘అఖండ’ ప్రభంజనాలు సృష్టించింది.
ఇక బాలయ్య పాన్ ఇండియా సినిమా అంటే అది దండయాత్రే అంటూ అభిమానులుల కామెంట్లు చేస్తున్నారు. తానికి తగ్గట్టుగానే గోపీచంద్ కూడా కథను మలుస్తున్నాడని, ఇందుకోసం గోపీ తెగ కసరత్తులు చేస్తున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా వేటపాలెం నేపథ్యంలో సాగనుండగా బాలయ్య పోలీస్‌గా దర్శనమిచ్చనున్నాడు. ఈ సినిమా విషయంలో మైత్రి మూవీమేకర్స్ వెనకడుగు వేసేది లేదని, భారీ బడ్జెట్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇక గోపీ చంద్, బాలయ్య యాక్షన్‌లోకి దిగడమే తరువాయి. మరి ఈ సినిమా పాన్ ఇండియానా కాదా అనేదానిపై వీరిలో ఎవరైనా త్వరలో క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.
#Balakrishna #Balayya #RRR #NTR #GopichandMalineni