

Bangarraju | అక్కినేని నాగార్జున చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘బంగార్రాజు’. ఇందులో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అదే విధంగా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ కూడా అంచనాలను మరింత అధికం చేశాయి. ఇటీవల నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. తాజాగా అభిమానులకు మరో ఫీస్ట్ ఇవ్వాలని సినిమా మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు విషయాన్ని చైతూనే స్వయంగా అనౌన్స్ చేశాడు.
డిసెంబర్ 17న ఊర మాస్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘బంగార్రాజు’ సన్నద్ధం అవుతున్నాడని చైతు ట్వీట్ చేశాడు. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేస్తుందని తెలిపాడు. దీంతో అభిమానులంతా డిసెంబర్ 17 కోసం ఎదురుచూస్తున్నారు.
#Bangarraju #AkkineniNagarjuna #NagaChaitanya