

Bheemla Nayak | పవన్ సినిమా అప్‌డేట్ అంటేనే ఫ్యాన్స్ స్పెషల్‌గా భావిస్తారు. అలాంటిది పవన్ పాడిన పాట అంటే ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. అయితే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా’ పాటతో పవన్ రచ్చరచ్చ చేశాడు. ఆ తరువాత అజ్ఞాతవాసి సినిమాలో ‘కొడకా కోటేశ్వర్రావా’ అంటూ మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసేశాడు. అయితే పవన్ తన తాజా సినిమా ‘భీమ్లా నాయక్’లోనూ ఓ పాటను స్వరపరిచాడంట.
ఈ పాటను మాటల మాంత్రికుడు త్రివిక్రం పట్టుబట్టి పవన్ చేత పాడించాడట. అయితే ఇన్నాళ్లు ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి వస్తుందని మేకర్స్ వరుస పాటలు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ కావడంతో వారు ఏ అప్‌డేట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారంట. అందుకోసమే పవన్ పాడిన పాటను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. కానీ న్యూఇయర్ స్పెషల్‌కి కేవలం పాట ప్రోమోను రిలీజ్ చేస్తారని, సంక్రాంతికి ఫుల్ పాటను రిలీజ్ చేస్తారని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి మొదటి వారంలో సినిమా ఫైనల్ కాపీ సిద్ధం కావచ్చని టాక్ వస్తుంది. మరి ఇందులో ఏమాత్రం నిజముందో తెలియాల్సి ఉంది.
#PawanKalyan #BheemlaNayak, #NewYear