

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా సినిమా పుష్పతో బాగా బిజీ అయిపోయాడు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ అందుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. దర్శకుడు సుకుమార్ కూడా ఇదే తరహా ఆలోచనతో దూసుకుపోతున్నాడు. ప్రేక్షకులను కట్టిపడేసేందుకు ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా ప్రతి ఎలిమెంట్‌ను దంచి కొడుతున్నాడని మూవీ టీం అంటోంది. ఇందులో బాగంగానే ఈ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్లు టీమ్ చెప్పింది. అంతేకాకుండా అభిమానులకు మరో మాస్ అప్‌డేట్ ఇచ్చేసింది. ఈ స్పెషల్ పాటకు స్టార్ హీరోయిన్ సమంత స్టెప్పులేసేందుకు సిద్ధమవుతోందని ప్రకటించింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇది కూడా చదవండి: 83 Trailer | ’83’ ట్రైలర్ అదిరిపోయిందిగా..!
అయితే ఇప్పుడు సమంత కోసం బన్నీ బాలీవుడ్‌కి వెళ్లాడని నెట్టింట తెగ వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం సమంత కోసమే బన్నీ బాలీవుడ్‌కి వెళ్లాడని, అక్కడి నుంచి పక్కా మాస్ మసాలా డాన్స్ కొరియోగ్రాఫర్‌ను తీసుకొచ్చాడని టాక్ నడుస్తోంది. అతనెవరో కాదు.. గణేష్ ఆచార్య. ఇదివరకే బన్నీ డీజే సినిమాలో ‘గుడిలో బడిలో’ పాటతో కుర్రకారు మతులు పోగొట్టిన గణేష్.. ఇప్పుడు పుష్ఫ స్పెషల్ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌గా చేయనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో పుష్ప స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. కానీ తమ ఊహలకు మించి ఉండటం పక్కా అని భావిస్తున్నారు. మరి పుష్ప రాజ్ స్పెషల్ సాంగ్ అభిమానుల ఊహలను మించి ఉంటుందా లేదా అన్నది చూడాలి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. త్వరలో మూవీ మేకర్స్ ఏదైనా ప్రకట చేస్తారేమో వేచి చూడాలి.
1 thought on “Allu Arjun | సమంత కోసం ముంబై వెళ్లిన పుష్పరాజ్..?”