

Akhanda | నందమూరి నటసింహం బాలకృష్ణ తనదైన పర్‌ఫుల్ పాత్రలతో దూసుకుపోతున్నాడు. తాజాగా బాలయ్య నటించిన సినిమా అఖండ. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. వచ్చే నెల 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మూవీటీమ్ ముస్తాబు చేస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 27న ప్రీ రెలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వస్తున్న ఐకాన్ స్టార్ అంతటితో సరిపెట్టడట. ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఇవ్వనున్నాడట. ఈ ఈవెంట్ సందర్భంగా బాలయ్య పాటకు పుష్పరాజ్ స్టెప్పులేయనున్నాడని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా బాలయ్య, బన్నీ ఇద్దరూ కలిసి కూడా చిందేయనున్నారని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సందే.
1 thought on “Akhanda | బాలయ్య పాటకు పుష్పరాజ్ స్టెప్పులు..?”