Warning: sprintf(): Too few arguments in /home/ff4q68c69pqk/public_html/wp-content/themes/covernews/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 253

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ..?

స్టార్ హీరోల సరసన అవకాశం అంటే గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. స్టార్ల పక్క నటించాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టే ప్రతి హీరోయిన్‌ కోరుకుంటుంది. కానీ కొందరిని మాత్రమే ఆ అవకాశం వరిస్తుంది. అందులోనూ సూపర్‌స్టార్ మహేష్ సరసన అంటే దాన్ని గోల్డెన్ కాదు అంతకు మించనే చెప్పుకోవాలి. అమ్మాయిల కలల రాకుమారుడి సరసన నటించే అవకాశం కోసం ప్రతి ఒక్క యంగ్ హీరోయిన్ వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ అద్భుత అవకాశం గ్లామర్ డాల్ నభా నటేష్ దక్కించుకుందని ఫిలిమ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవనండీ.. నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచమందీ అమ్మడు. ఆ తరువాత మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కుర్రకారుని కట్టిపడేసింది. కానీ ఆ తరువాత అమ్మడికి ఆ రేంజ్ హిట్ దక్కలేదు. ప్రస్తుతం అమ్మడు యంగ్ హీరో నితిన్ తాజా సినిమా ‘మ్యాస్ట్రో’లో నటిస్తోంది.

అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రానున్న హ్యట్రిక్ మూవీకి అమ్మడిని ఓకే చేశారట. అదేంటి.. ఈ సినిమాలో పూజా హెగ్దేను హీరోయిన్‌గా ప్రకటించారుగా అనుకుంటున్నారా..! నభా నటేష్ సెకండ్ హీరోయిన్ అంటలేండి. ఈ మేరకు వార్తలు ప్రస్తుతం నెట్టింగ్ షికార్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో చిత్ర బృందం ఏమైనా ప్రకటిస్తుందేమో వేచి చూడాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *