పట్టాలెక్కుతున్న ‘ఓ మై గాడ్ 2’..?
బాలీవుడ్ సినిమా అంటేనే దేశమంతటా క్రేజ్ ఉంటుంది. వాటిలోనూ కొన్ని సినిమాలు మాత్రం అందరినీ కట్టి పడేస్తాయి. అంతేకాదు ఆ సినిమాలు సెండ్ పార్ట్ వస్తే బాగుండని ప్రేక్షకులు కోరుకుంటారు. కానీ వాటిలో చాలా సిమాలు రెండో భాగం రాదు. అలా కోరుకునే సినిమాల్లో ‘ఓ మై గాడ్’ సినిమా తప్పక ఉంటుంది. పరేష్ రావెల్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ మెప్పించింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు. అయితే తాజాగా దీనిపై బాలీవుడ్‌లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఓ మై గాడ్ 2’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, ఇందులో ప్రధాన పాత్రలో పంకజ్ త్రిపాఠి నటిస్తున్నాడగా అక్షయ్ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడట. అంతేకాకుండా ముద్దుగుమ్మ యామిగైతమ్ హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. అక్షయ్ ఈ సినిమాలో కూడా కృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడని, అందుకు సంబంధించిన షూటింగ్ కోసం తన 20 రోజుల కాల్షీట్లను కేటాయించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అమితాయ్ రాయ్ దర్శకత్వం చేస్తుండగా అక్షయ్ కుమార్, అశ్విన్ వర్డే సంయుక్తంగా నిర్మిస్తున్నారని సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.