చెర్రీ మూవీకి గెస్ట్‌గా బాలీవుడ్ స్టార్..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో జోరు కనబరుస్తున్నాడు. ఒకవైపు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూనే మరో భారీ సినిమాను ఓకే చేశాడు. ఆర్ఆర్ఆర్ పూర్తియిన వెంటనే శంకర్ దర్శకత్వంతో చెర్రీ 15 సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అనేక వార్తలు నెట్టింట్ హల్‌చల్ చేశాయి. తాజాగా మరో వార్త సినీ సర్కిల్స్‌లో షికార్లు కొడుతోంది. చెర్రీ, శంకర్ కాంబో సినిమా ఓపెనింగ్‌కి బాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రన్‌వీర్ సింగ్ గెస్ట్‌గా రానున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ అంతా మెగా హీరో సినిమా ఓపెనింగ్ ఈ రేంజ్‌లో ఉంటే సినిమా ఏరేంజ్‌లో ఉంటుందో అని తెగ సంబర పడిపోతున్నారు. అంతేకాకుండా సినిమాపై ఊహాగానాలకు హద్దులు చెరిపేశారు. సినిమా ఏ స్థాయిలో ఉంటుందనేది ఎవరి ఊహలకు అందదని అభిమానుల అభిప్రాయం. మరేం జరుగుతుందో వేచి చూడాలి.